కొత్తగా ఏర్పడిన రాష్ట్ర చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ వావిలాల సరళాదేవి ఉత్తరాంధ్రలో తెలుగుదేశంపార్టీ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు. మండుటెండల్లో ఉత్తరాంధ్రలోని ప్రముఖ పట్టణాల్లో చేనేత కులాల సంఘీయులతో సమావేశాలు ఏర్పాటు చేసి..ప్రజల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని..ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు మేలు చేసేందుకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదేనని ఈ సందర్భంగా తెలిపారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా తొలిసారి చేనేత కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన నేపథ్యంలో పలుచోట్ల ఘనంగా సన్మానాలు ఏర్పాటుచేశారు. ఈనేపథ్యంలో చేనేత కులాల వర్గీయులు, ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. మండుటెండల్లో పర్యటించి..పార్టీ కోసం శ్రమించే వారికి తగిన గుర్తింపు తప్పకుండా ఉంటుందని తెలిపారు.
మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం అథికారంలోకి వస్తే మన చేనేత కులాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని, కార్పొరేషన్ పూర్తి అధికారాలతో పనిచేస్తుందని..నిధులు ఉంటాయని..ప్రతి పనికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి.. వారు సంబంధిత మంత్రులకి చెప్పాలి..వాళ్లు ఆమోదించాలి..ఆ తర్వాత బడ్జెట్ లో పెట్టాలి..ఇన్ని తతంగాలు ఉండేవి..

కార్పొరేషన్ రావడంతో ఆ కష్టాలన్నీ తీరినట్టేనని తెలిపారు. ముఖ్యమంత్రిగారి నినాదం..మీ భవిష్యత్తు..నా బాధ్యత.. అందువల్ల..మన చేనేత కులాల సమస్యలు తీరాలంటే..ఇదే సరైన సమయం వచ్చింది..అందరం కలిసికట్టుగా ఓటు వేస్తే..ఈ కార్పొరేషన్ ద్వారా అందే ఫలాలు అందుకోవచ్చునని హర్షధ్వానాల మధ్య తెలిపారు. ఇలా పర్యటనను విజయవంతంగా ముగించారు.
తణుకు ప్రాంతానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకులు వావిలాల సరళాదేవి
సుమారు 20ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ..పార్టీ పటిష్టానికి తనవంతు కృషి చేసే వావిలాల సరళాదేవి సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తించి తాజాగా ఏర్పాటుచేసిన రాష్ట్ర చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఆమెను నియమించారు.

ఉత్తరాంధ్ర శ్రీకాకుళం నుంచి మొదలు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో తొలి నామినేటెడ్ పదవి పొందిన పద్మశాలీల ఇంటి ఆడపడుచుగా పేరుపొందారు. దీంతో రాజకీయంగా తొలిసారి ఒక చేనేతల్లో ఒక చైతన్యవంతమైన కదలిక వచ్చిందనే చెప్పాలి. ఇది ఒక శుభసూచకంగా పరిగణించాలని చేనేత కులాల నేతలు పేర్కొంటున్నారు.








