24.6 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ శ్రీవారి భక్తులకు షాక్.. 6 నుంచి లడ్డూలపై రాయితీ ఎత్తివేత!

శ్రీవారి భక్తులకు షాక్.. 6 నుంచి లడ్డూలపై రాయితీ ఎత్తివేత!

- Advertisement -

తిరుపతి: తిరుమల శ్రీవారి భక్తులకు ఇది కొంత చేదువార్తే. ఇప్పటి వరకు భక్తులకు విక్రయిస్తున్న లడ్డూలపై రాయితీని ఎత్తివేసి ఒక్కో లడ్డూను పది రూపాయల లాభానికి విక్రయించాలని నిర్ణయించింది. ఈ నెల ఆరో తేదీన వైకుంఠ ఏకాదశి నుంచి ఇది అమల్లోకి రానుంది.

ప్రస్తుతం ఒక్కో లడ్డూ తయారీకి రూ.40 ఖర్చవుతుండగా, ఇకపై దానికి పది రూపాయలు కలిపి రూ.50లకు భక్తులు కోరుకున్నన్ని లడ్డూలు విక్రయించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. ప్రస్తుతం కాలినడకన వస్తున్న భక్తులకు ఒక ఉచిత లడ్డూను ఇస్తోంది. రోజుకు 20 వేల మంది భక్తులకు ఇలా అందిస్తోంది.

ఇక ఉచిత లడ్డూ.. ఒకటే

దివ్య దర్శనం, టైంస్లాట్, సర్వదర్శనం భక్తులు రెండు లడ్డూలు పది రూపాయలకు, మరో రెండు లడ్డూలను రూ.25కి విక్రయిస్తోంది. అలాగే, రూ.300 టికెట్‌పై ప్రత్యేక దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, విశేష ఆర్జిత సేవల భక్తులకు రెండేసి లడ్డూలను ఉచితంగా ఇస్తోంది.

ఇకపై వీటిపై రాయితీలు ఎత్తివేసి ప్రతీ భక్తుడికి ఉచితంగా ఒక లడ్డూ, 50 రూపాయలకు కావాల్సినన్ని లడ్డూలు ఇవ్వనుంది. లడ్డూ ప్రసాదంపై రాయితీ వల్ల ఏడాదికి రూ.250 కోట్లకు పైగా భారం పడుతుండడంతో టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -