22.1 C
Hyderabad
Saturday, November 28, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ తిరుమల భక్తులపై టీటీడీ ఆంక్షలు.. అలా వుంటే రావొద్దని వినతి

తిరుమల భక్తులపై టీటీడీ ఆంక్షలు.. అలా వుంటే రావొద్దని వినతి

- Advertisement -

తిరుపతి: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సూచనలు చేసింది.

జలుబు, దగ్గుతో బాధపడే భక్తులు తిరుమల రావొద్దని విజ్ఞప్తి చేసింది. ఇటువంటి వారు దర్శనానికి వస్తే.. భక్తుల రద్దీ కారణంగా ఆ వైరస్ మరింత వ్యాపించే అవకాశం ఉందని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ పేర్కొంది.

శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల్లో ఎవరికైనా ఇటువంటి లక్షణాలు ఉన్నట్టు కనిపిస్తే వెంటనే వారిని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్‌)కు తరలించాలని నిర్ణయించింది.

అలాగే.. భక్తులు శానిటైజర్లు, మాస్కులతోనే తిరుమలకు రావాలని, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

చదవండి: తిరుమలలో ఎంపీ శశికళ పుష్పకు చేదు అనుభవం
- Advertisement -