34.3 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో భూ ప్రకంపనలు: పరుగులు తీసిన జనం

గుంటూరు జిల్లాలో భూ ప్రకంపనలు: పరుగులు తీసిన జనం

piduguralla
- Advertisement -

గుంటూరు: జిల్లాలోని పిడుగురాళ్లలో నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూప్రకంపనలు సంభవించచడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తొలుత కొన్ని క్షణాలపాటు భూమి కంపించింది.

దీంతో ఆందోళన చెందిన ప్రజలు తమ నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారు. ఆ తర్వాత మళ్లీ వారి వారి ఇళ్లల్లోకి చేరుకున్నారు. అయితే, మరో 20 నిమిషాల తర్వాత మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి.

ఈ క్రమంలో భయాందోళనకు గురైన ప్రజలు వారి వారి ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. గంట వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించడంతో ప్రజలంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్వల్ప భూప్రకంపనలే కావడంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -