24.8 C
Hyderabad
Friday, October 16, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల్లో ఈయనే టాప్! ఆస్తులు రూ.895 కోట్లు మరి…

తెలుగు రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల్లో ఈయనే టాప్! ఆస్తులు రూ.895 కోట్లు మరి…

- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం మరింత హీటెక్కింది. గతంలో చివరి దశలో జరిగే ఎన్నికలు ఈసారి మొదటి విడతలోనే జరుగుతుండడంతో నేతలందరూ ఉరుకులు పరుగులు మీద అన్ని కార్యక్రమాలని చక్కదిద్దుకుంటున్నారు.

మొదటి విడత ఎన్నికల షెడ్యూల్‌లో భాగంగా ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతుండగా, తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.

షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల దాఖలుకు గడువు సోమవారంతో ముగియనుంది. దీంతో నామినేషన్లు వేసేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా ప్రధాన పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేశారు.

అందరూ కోట్లకు పడగలెత్తినవారే…

వారిలో ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్, పవన్ కళ్యాణ్, ఏపీ మంత్రులు, తెలంగాణ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. వీరిలో చాలామంది నేతలు ఆర్థికంగా బలంగా ఉన్నవారే.

ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే వారి అఫిడవిట్ లో వారి ఆస్తుల విలువ కూడా చేర్చవలసి ఉంటుంది. వారి వారి నామినేషన్ అఫిడవిట్ ప్రకారం.. తెలంగాణలో ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తుల పరంగా అగ్రస్థానంలో ఉన్నారు.

తనకు రూ.895 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఆయన తన అఫిడవిట్‌లో చేర్చారు. మరోవైపు ఏపీలో మాత్రం మంత్రి నారాయణ ఆస్తుల పరంగా అగ్రస్థానంలో నిలిచారు. రూ. 650 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

అయితే 2014తో పోలిస్తే జగన్ ఆస్తుల విలువ తగ్గినట్లు కనిపిస్తోంది. అదేవిధంగా నరసాపురం వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు ఆస్తులు రూ.324 కోట్లు కాగా, గుంటూరు టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ఆస్తుల విలువ రూ.266కోట్లుగా అఫిడవిట్‌లో పొందుపరిచాడు.

అలాగే సినీనటుడు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌ విశాఖ లోక్‌సభ బరిలో ఉన్న విషయం తెలిసిందే, భారత్ ఆస్తుల విలువ రూ.200 కోట్లు. ఈ విషయాన్ని ఆయనే తన అఫిడవిట్‌లో వివరించాడు.

- Advertisement -