ఆ విషయంలో సీఎంని మెచ్చుకున్న టీడీపీ నేత…

TDP Leader News, APCM Latest News, YS Jagan Latest News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఎట్టి పరిస్థితుల్లోనూ తను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే పని లేదని ఏపీ సీఎం జగన్…నిన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవేళ ఎమ్మెల్యేలని తీసుకున్న రాజీనామా చేయించే పార్టీలోకి తీసుకుంటానని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులపై జగన్ చేసిన వ్యాఖ్యలను తాను వ్యక్తిగతంగా అభినందిస్తున్నట్టు చెప్పారు. అయితే నిన్న అసెంబ్లీలో చంద్రబాబు గురించి అధికార పక్ష సభ్యులు హేళనగా మాట్లాడటం సబబు కాదని అన్నారు.

అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది తమతో టచ్ లో ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరి కాదని అన్నారు. అటు ఈరోజు అసెంబ్లీ గవర్నర్ ప్రసంగంపై బుద్దా స్పందిస్తూ…ఈ ప్రసంగం కేవలం ‘నవరత్నాలు’పైనే ఉందని, మిగతా విషయాల గురించి ఆయన పెద్దగా మాట్లాడలేదని అన్నారు.

ఇక కొత్త ప్రభుత్వం ఏర్పండి పదిపదిహేను రోజులే అయింది కనుక, వేచి చూస్తామని, ఇప్పుడే విమర్శలు గుప్పించడం కరెక్టు కాదని అన్నారు.

చదవండి: జగన్‌ను చూసైనా కాస్త మారేందుకు ప్రయత్నించు కేసీఆర్: విజయశాంతి
- Advertisement -