
అమరావతి: ఏపీలో ఎన్నికలు ముగిసి మూడు వారాలు కావొస్తున్నా కూడా , ఎన్నికల వేడి మాత్రం తగ్గడం లేదు. ఎన్నికల ఫలితాలకు ఇంకా రెండు వారాల సమయం ఉండటం తో అన్ని పార్టీల అభ్యర్థులు టెంక్షన్ లో ఉన్నారు. మరోవైపు కొంతమంది ఈ టెంక్షన్స్ ని తట్టుకోలేక విహారయాత్రలంటూ తిరుగుతున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలు ముగిసిన సమయం నుండి కొన్ని రోజులు సెలవులు తీసుకోని , ఆ పై రాజకీయంగా ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. నియోజకవర్గాల వారీగా పోటీ చేసిన అభ్యర్థులతో సమీక్షలు నిర్వహించి , గెలుపు పై ఒక అంచనాకి వస్తున్నారు.
చదవండి: ఆ సీటు జనసేనకి దక్కే అవకాశం ఉందటా…!
ఈ నేపథ్యంలోనే తాజాగా అయన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబునాయుడు సమీక్షించనున్నారు. మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్ లో ఈ సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ సమీక్షలకు ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు, బూత్ స్థాయి కన్వీనర్లు, ముఖ్యనేతలు హాజరుకానున్నారు.
పోలింగ్ తీరు తెన్నులపై పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులు ఓ నివేదిక సమర్పించనున్నారు. అనంతరం కౌంటింగ్ ఏజెంట్ల ఎంపిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు అని సమాచారం. ఎన్నికల కౌటింగ్ ముగిసేవరకు ఏమరపాటుగా ఉండకూడదు అని అందరికి హితబోధ చేస్తునట్టు తెలుస్తోంది.








