
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…పాలనలో తన మార్క్‌ని చూపించడం మొదలెట్టారు. ఇప్పటికే ప్రభుత్వంలోని కొన్ని కీలక శాఖల అధికారులను బదిలీ చేసిన సీఎం… ఇప్పుడు రాష్ట్ర డీజీపీని కూడా మార్చేశారు.
ప్రస్తుత ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా బదిలీ చేసి.. ఆయన స్థానంలో నిన్నటి వరకు విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన గౌతమ్ సవాంగ్‌ను డీజీపీగా నియమించారు.
అలాగే ఏపీ ఏసీబీ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న కుమార్ విశ్వజీత్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్ఎస్ రావత్‌ను, ముఖ్యమంత్రి కార్యదర్శిగా సాల్మన్ ఆరోగ్యరాజ్‌కు బాధ్యతలు అప్పగించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓఎస్టీగా కృష్ణమోహన్ రెడ్డిని నియమించారు.








