- Advertisement -
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్గాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నై సహా 7 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
కాంచీపురం, విల్లుపురం, తిరువళ్లూరు జిల్లాల్లో వర్షం ప్రభావం అధికంగా ఉంటుందని, అలాగే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు.
మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. భారీ వర్షం హెచ్చరికలతో తమిళనాడులోని 7 జిల్లాల్లో విద్యా సంస్థలకు ముందు జాగ్రత్తగా సెలవు ప్రకటించారు. రెస్క్యూ టీం లను సిద్ధం చేశామని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
- Advertisement -