22.1 C
Hyderabad
Saturday, November 28, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ సంచలనం: ‘పీకే’ లాస్ట్ సర్వే, ఏపీలో వైసీపీ కచ్చితంగా గెలిచే అసెంబ్లీ స్థానాలు ఇవే…

సంచలనం: ‘పీకే’ లాస్ట్ సర్వే, ఏపీలో వైసీపీ కచ్చితంగా గెలిచే అసెంబ్లీ స్థానాలు ఇవే…

- Advertisement -
ఏపీ: ఏపీలో ఎన్నికలు ముగిసినా కూడా ఎన్నికల వేడి మాత్రం తగ్గడం లేదు. ఫలితాల కోసం అన్ని పార్టీలు ఎదురుచూస్తున్నాయి. అలాగే  ప్రధాన పార్టీలు అన్ని కూడా విజయం పై చాలా ధీమాని వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఎన్నికల ప్రచారం ముగిసినా కూడా ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు మాత్రం తగ్గడంలేదు.
 
ఏపీలో త్రిముఖ పోరు తప్పదని తెలుస్తుంది. రాష్ట్ర స్థాయిలో స్వతంత్ర సంస్థలు జరిపిన సర్వేలలో కానీ, జాతీయ స్థాయిలో వెల్లడైన సర్వేలలో కానీ ఫలితం ఒకే విధంగా వస్తోంది. అది ఏమిటంటే.. ఈసారి ఏపీలో అధికారం చేప్పట్టబోయేది వైసీపీయే అట .
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అవ్వబోతున్నాడు అని అన్ని సర్వేలు చెబున్నాయి. ఏపీలో 22 పార్లమెంట్ స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంటుందని సర్వేలో వెల్లడైంది. 
 
ఇక ఏపీలో చేసిన కొన్ని సర్వేలలో మాత్రం  ప్రజలు మరోసారి టీడీపీకే పట్టం కట్టబోతున్నారు అని చెబున్నాయి. ఈ సర్వేలు ఎలా ఉన్నా కూడా ప్రజల తీర్పు మాత్రం ఇప్పటికే ఈవీఎంలలో దాగి ఉంది. వారు కచ్చితంగా ఎవరికీ ఓటు వేశారో మాత్రం  ఫలితాల రోజే తేలుతుంది.

ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే…

సర్వేలన్నీ ఎలా ఉన్నా కూడా ఈ ఎన్నికలలో టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అనేంత రేంజ్‌లో ఒకరికి ఒకరు గట్టి పోటీని అయితే ఇస్తున్నాయనే చెప్పాలి. ఇలాంటి సమయంలో తాజాగా ఓ సర్వే ఫలితాలు విడుదలయ్యాయి.
 
ఇది వైసీపీ ఎన్నికల వ్యూహకర్త పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ సర్వే అని, పోలింగ్ తరువాత  కచ్చితంగా ఈ స్థానాలలో వైసీపీ గెలుపు దిశగా వెళ్లిందని, ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడి వైసీపీ అభ్యర్ధులని గెలిపించబోతున్నారంటూ సర్వే చెబుతోంది.
 
ప్రస్తుతం ఈ  సర్వే ఫలితాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పీకే సర్వే ప్రకారం… జిల్లాల వారీగా ఎవరూ ఎక్కడినుండి గెలవబోతున్నారో చూద్దాం ….
 
శ్రీకాకుళం… శ్రీకాకుళం జిల్లా నుండి నరసన్నపేట, శ్రీకాకుళం, పాలకొండ, ఎచ్చెర్ల, పాతపట్నం.. ఈ ఐదు స్థానాలలో భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారని ఈ సర్వే పేర్కొంది.  
 
విజయనగరం… కురుపాం, సాలూరు, చీపురుపల్లి, పార్వతీపురం, గజపతి నగరం.. ఈ ఐదు అసెంబ్లీ స్థానాలలో వైసీపీ అభ్యర్థులు భారీ మెజార్టీ‌తో గెలుపొందనున్నారు. 
 
విశాఖపట్నం… పాడేరు, అరకు, నర్సీపట్నం, చోడవరం, భీమిలి, పాయకరావుపేట.. ఈ ఆరు అసెంబ్లీ స్థానాలలో వైసీపీ అభ్యర్థులు అత్యధికమైన మెజారిటీ గెలబోతునట్టుగా ఈ సర్వేలో వెల్లడైంది. 
 
తూర్పు గోదావరి జిల్లా విషయానికొస్తే.. కొత్తపేట, తుని, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పత్తిపాడు, అమలాపురం, పి  .గన్నవరం , జగ్గంపేట ..ఈ ఎనిమిది స్థానాలలో తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు , భారీ మెజారిటీతో గెలుపొందబోతున్నారని తెలుస్తుంది. 
 
పచ్చిమ గోదావరి…  జిల్లా నుండి పోలవరం, కొవ్వూరు, భీమవరం, నర్సాపురం, చింతలపూడి, ఆచంట అసెంబ్లీ స్థానాలలో వైసీపీ అభ్యర్థులు సమీప ప్రత్యర్థులపై భారీ మెజారిటీతో గెలవబోతున్నట్టు ఈ సర్వే ఫలితాలలో వెల్లడైంది.
 
కృష్ణా జిల్లా విషయానికొస్తే… గుడివాడ, తిరువూరు, పామర్రు, కైకలూరు, నూజివీడు, విజయవాడ వెస్ట్.. ఈ ఆరు అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో వైసీపీ అభ్యర్థులు అత్యధికమైన మెజారిటీతో గెలిచి, వైసీపీ జెండా ఎగురవేస్తారని తెలుస్తోంది. 
 
గుంటూరు జిల్లా విషయానికొస్తే… సత్తెన్నపల్లి, బాపట్ల, రేపల్లె, నరసరావుపేట, గుంటూరు ఈస్ట్, మాచెర్ల.. ఈ ఆరు అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో వైసీపీ తమ హవాని కొనసాగించి, అభ్యర్థులు అత్యధికమైన మెజారిటీతో గెలవబోతునట్టుగా సర్వేలో వెల్లడైంది.
 
ప్రకాశం జిల్లాలో.. చీరాల, మార్కాపురం, సంతనూతలపాడు, ఎర్రగొండుపాళెం, దర్శి , కనిగిరి, కందుకూరు, కొండపిలలో వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారంటూ తెలుస్తోంది. గత ఎన్నికలలో కూడా జిల్లాలో అత్యధికమైన సీట్లు వచ్చాయి. అదే హవాని కొనసాగించి, ఈసారి కూడా భారీ స్థానాలని కైవసం చేసుకోబోతున్నట్లు ఈ సర్వే చెబుతోంది. 
 
నెల్లూరు జిల్లా విషయానికొస్తే .. నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట అని చెప్పవచ్చు. గత ఎన్నికలలో వైసీపీ ఎక్కువ స్థానాలని సంపాదించిన జిల్లాగా నెల్లూరుకి ఒక రికార్డ్ ఉంది. ఈ జిల్లా నుండి నెల్లూరు సిటీ , నెల్లూరు రూరల్ , సర్వేపల్లి , వెంకటగిరి , కావలి , ఆత్మకూరు , ఉదయగిరి , కోవూరు, సూళ్లూరుపేట దాదాపుగా జిల్లాలోని తొమ్మిది స్థానాలలో వైసీపీ గెలుస్తోంది అని , అలాగే నెల్లూరులో క్లీన్ స్వీప్ చేసే అవకాశం కూడా కనపడుతోంది అని ఈ సర్వే రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. 
 
ఇక సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు విషయానికొస్తే.. పొంగనూరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, పీలేరు, నగరి, గంగాధర నెల్లూరు.. ఈ ఏడు అసెంబ్లీ స్థానాలలో వైసీపీ అభ్యర్థులు భారీ గెలుపు దిశగా ఉన్నారని, జిల్లాలో మెజారిటీ స్థానాలు వస్తాయని ఈ సర్వే రిపోర్ట్ చెబుతోంది.
 
అనంతపురం విషయానికొస్తే … అనంతపురం అర్బన్, రాయదుర్గం, సింగనమల, గుంతకల్లు, పుట్టపర్తి.. ఈ స్థానాలలో వైసీపీ అభ్యర్థులు విజయదుందుభి మెగిస్తారని సమాచారం. 
 
ఇక గత ఎన్నికలలో వైసీపీకి ఎక్కువ స్థానాలు ఇచ్చిన మరో జిల్లాగా పేరొందిన కర్నూల్  విషయానికొస్తే … నంద్యాల, పాణ్యం, మంత్రాలయం, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆలూర్, నందికొట్కూరు.. ఇలా దాదాపుగా తొమ్మిది స్థానాలని  కర్నూల్ జిల్లాలో వైసీపీ కైవసం చేసుకొని, మరోసారి జిల్లాపై పట్టు సాధిస్తుంది అని ఈ సర్వేలో వెల్లడైంది. 
 
ఇక ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత  వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప..  వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట అని అందరికి తెలిసిందే. గత ఎన్నికలలో టీడీపీ ఈ కడప జిల్లా నుండి కేవలం ఒకే ఒక స్థానంలో విజయం సాధించింది.
 
ఈ ఎన్నికలలో కూడా వైసీపీ కడప జిల్లాలో తన ప్రభావాన్ని ఏమాత్రం తగ్గించుకోకుండా మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాలని గెలుచుకొని, పూర్తి ఆధిపత్యాన్ని చూపిస్తుందని పీకే చివరి సర్వే చెబుతోంది.
 
మొత్తం మీద చూస్తే… హోరాహోరి పోరు లేకుండా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా 90 సీట్లు గెలుస్తుందని ఈ సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది.
- Advertisement -