29.2 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ పిన్నమనేని మెడికల్ కాలేజీ సెక్యూరిటీ సూపర్ వైజర్ దారుణహత్య

పిన్నమనేని మెడికల్ కాలేజీ సెక్యూరిటీ సూపర్ వైజర్ దారుణహత్య

- Advertisement -

విజయవాడ: కృష్ణా జిల్లా చిన అవుటుపల్లిలో దారుణం జరిగింది. పిన్నమనేని మెడికల్ కాలేజ్ సెక్యూరిటీ సూపర్ వైజర్ దారుణ హత్యకు గురయ్యాడు.

గత అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సూపర్ వైజర్ వెంకటేశ్వరరావు ఇంట్లో ప్రవేశించి కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఆయనను కత్తులతో పొడిచి చంపారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వెంకటేశ్వరరావు స్వస్థలం ప్రకాశం జిల్లా మార్కాపురంగా గుర్తించారు.

ఆయనను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? పాత కక్షలేమైనా ఉన్నాయా? హత్య చేయటానికి ఎంతమంది వచ్చారు? ఎందుకు చంపారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -