26.2 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం చిగురుపాటి మృతి కేసులో వెలుగులోకి నమ్మలేని నిజాలు! రెండు రోజుల క్రితమే కిడ్నాప్?

చిగురుపాటి మృతి కేసులో వెలుగులోకి నమ్మలేని నిజాలు! రెండు రోజుల క్రితమే కిడ్నాప్?

nri-chigurupati-jayaram
- Advertisement -

Jayaram Chigurupati mudder

విజయవాడ: ప్రముఖ ఎన్నారై, ఎక్స్‌ప్రెస్‌ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్య కేసులో కొన్ని నమ్మలేని నిజాలు ఇప్పుడిపుడే వెలుగులోకి వస్తున్నాయి. జయరాంను రెండు రోజుల క్రితమే కిడ్నాప్ చేసినట్లు దర్యాప్తు చేస్తున్న పోలీసులు భావిస్తున్నారు. జయరాం తల, ఛాతి, పొట్టపై పిడిగుద్దులు గుద్దడంతో కమిలిపోయినట్లు పోస్టుమార్టంలో తేలినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద హైవేపై కారులో జయరామ్‌ మృతదేహం లభ్యమైంది.

కాగా ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న నందిగామ పోలీసులు అసలేం జరిగింది..? ఈ ఘటనకు పాల్పడిందెవరు..? కుటుంబ సభ్యులే పొట్టనపెట్టుకున్నారా..? ఇలా అనేక కోణాలలో పోలీసులు విచారిస్తున్నారు.

ఎన్నారై కేసులో కుటుంబ సభ్యులే కీలకం…

చిగురుపాటి హత్యకు హైదరాబాద్‌‌లోనే కుట్ర జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులను, బ్యాంకు అధికారులను, కారు డ్రైవర్‌ను అధికారులు ప్రశ్నించారు. త్వరలోనే జయరాం మేనకోడలు శిఖా చౌదరిని పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది . అలాగే కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లోని జయరాం ఇంటిని పరిశీలించారు.

జూబ్లీహిల్స్ లోని జయరాం ఇంటికి చేరుకున్న నందిగామ పోలీసులు ఆ ఇంటి ఆవరణలోని సీక్రెట్ కెమెరాలలోని సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

చదవండి …సూపర్ స్టార్ మహేష్‌బాబు పేరుకి.. కొత్త అర్థం చెప్పిన ‘అర్బన్ డిక్షనరీ’!

- Advertisement -