మానవా.. ఇక నువ్వు మారవా?: మళ్ళీ నోరుజారి దొరికిపోయిన నారా లోకేశ్!

Nara Lokesh Latest News, Nara Lokesh Latest Campaigning News, AP Latest Election News, Newsxpressonline
- Advertisement -
అమరావతి: మంత్రి నారా లోకేశ్ మళ్లీ నోరుజారి దొరికిపోయారు. తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధా రంగానగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారం మాట్లాడుతూ ఆయన తనదైన శైలిలో జనాన్ని కాసేపు జుట్టుపీక్కునేలా చేశారు. 
 
ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ఏప్రిల్‌ తొమ్మిదో తేదీన ఎన్నికలు జరుగనున్నాయని, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని కోరారు. లోకేశ్ వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా కంగుతిన్నారు.
 
ఎన్నికలు తొమ్మిదో తేదీన కాదు, పదకొండున అని పక్కనే ఉన్న తెలుగు దేశం నాయకుడు బండి చిరంజీవి అందివ్వడంతో లోకేశ్‌ కవర్‌ చేసుకున్నారు.

విల్లుపురంలో ఏం జరిగిందంటే…

శ్రీకాకుళం జిల్లా మందసం మండలంలోని విల్లుపురంలో మంత్రి లోకేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ నోరు జారిన 
సంగతి తెలిసిందే.  పసుపు-కుంకుమ పథకం కింద ప్రతీ రైతు కుటుంబానికి రూ.15 వేలను సీఎం చంద్రబాబు ఇస్తున్నారంటూ ఆయన అనడంతో అక్కడున్న జనం మొహమొహాలు చూసుకున్నారు. 
 

ఏపీలోని ప్రతీ మహిళకు పసుపు-కుంకుమ పథకం కింద ఇచ్చే నగదును.. రైతులకు ఇస్తున్నాం అంటూ లోకేశ్ మాట జారారు. 2014లో రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.2000కు పెంచిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ధనిక రాష్ట్రం అని చెప్పుకునే ఇతర ఏ రాష్ట్రంలోనూ ఈ పెన్షన్ ఇవ్వటంలేదన్నారు. రానున్న రోజుల్లో ఈ పెన్షన్ రూ.3000 చేస్తామని హామీ ఇచ్చారు.

పసుపు-కుంకుమ అందించిన వ్యక్తిని గెలిపిద్దామా? లేక పసుపు-కుంకమలు చెరిపేసిన వ్యక్తిని గెలిపిద్దామా అనే విషయాన్ని ప్రతీ ఒక్కరు ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయాలని లోకేశ్ పిలుపునిచ్చారు. ఇలా ప్రజలకు ఉపయోగపడే 120 సంక్షేమ పథాకాలను అమలు చేసే ఘనత మన సీఎం చంద్రబాబుకే దక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

 
గతంలో ఉండే విద్యుత్ కష్టాలను కూడా అధిగమించామనీ..దాంట్లో భాగంగా 24 గంటల విద్యుత్ అందిస్తున్నామనీ..ప్రతీ ఇంటికీ పెద్ద కొడుకుగా ఉండి వారి అవసరాలను తీరుస్తు ఆర్థిక కష్టాల్లో కూడా సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్న ఘనత మన ఏపీ ప్రభుత్వానిదనీ..దాని కోసం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారీ రాష్ట్రం అభివృద్ధిని కోరుకునే ప్రతీ ఒక్కరూ మరోసారి చంద్రన్నకు ఓటేసి గెలిపించాలని మంత్రి లోకేశ్ హరిపురం ఎన్నికల ప్రచారంలో ప్రజలను కోరారు.
 
 
- Advertisement -