25.6 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ టీడీపీ-వైసీపీ ఘర్షణ: గన్‌మెన్ కాల్పుల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి గాయాలు, మంత్రాలయంలో ఉద్రిక్తత

టీడీపీ-వైసీపీ ఘర్షణ: గన్‌మెన్ కాల్పుల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి గాయాలు, మంత్రాలయంలో ఉద్రిక్తత

mantralayam tdp candidate thikka reddy injured in attack, Newsxpressonline
- Advertisement -

కర్నూలు: జిల్లాలోని మంత్రాలయం మండలం ఖగ్గళ్లు‌లో శనివారం ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పార్టీ జెండా ఆవిష్కరణకు వచ్చిన మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకుని దాడికి యత్నించారు. ఈ క్రమంలో తిక్కారెడ్డి గన్‌మెన్‌ గాల్లోకి కాల్పులు జరపారు.

అయితే, ప్రమాదవశాత్తూ ఈ కాల్పుల్లో తిక్కడారెడ్డి సహా ఏఎస్‌ఐ గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. మంత్రాలయం అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ నేత తిక్కారెడ్డి శనివారం ఉదయం మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలో ఖగ్గళ్లు‌‌లో కూడా పర్యటించారు.

వేట కొడవళ్లతో దాడులు..

తొలి నుంచి వైసీపీకికు పట్టున్న గ్రామమైన ఖగ్గళ్లు‌లో టీడీపీ జెండా ఆవిష్కరించడానికి తిక్కారెడ్డి సహా పలువురు కార్యకర్తలు అక్కడకి చేరుకున్నారు. దీంతో వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి భార్య జయమ్మ, ఆయన కుమారుడు ప్రదీప్‌రెడ్డి గ్రామస్థులతో కలిసి వారిని అడ్డుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. వేటకొడవళ్లతో దాడులకు దిగారు.

ఈ క్రమంలో తిక్కారెడ్డి గన్‌మెన్‌ గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే, ప్రమాదవశాత్తూ తిక్కారెడ్డి ఎడమకాలికి బుల్లెట్‌ గాయమైంది. మాధవరం ఏఎస్‌ఐ వేణుగోపాల్‌ కుడి కాలికి గాయమైంది. దీంతో వారిని వెంటనే ఆదోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 

- Advertisement -