21.7 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ సంచలనం: విప్ పదవిని తిరస్కరించిన కేశినేని నాని…

సంచలనం: విప్ పదవిని తిరస్కరించిన కేశినేని నాని…

Kesineni Nani Latest News, Chandrababu Naidu News, AP Political News , Newsxpressonline
- Advertisement -

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై… లోక్‌సభలో టీడీపీ విప్‌ పదవిని ఎంపీ కేశినేని నానికి అప్పగించిన విషయం తెలిసిందే. అలాగే సీఎం రమేశ్‌ను రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎన్నుకున్నారు.

అయితే కేశినేని నాని విప్ పదవిని తిరస్కరించారు. తనకు లోక్‌సభలో విప్ పదవి అప్పగించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు అని, తనకంటే సమర్ధుడైన వేరొకరిని ఆ పదవిలో నియమించాలని కోరుతున్నాని నాని పేర్కొన్నారు. అయితే అంత పెద్ద పదవికి తాను అనర్హుడినని భావిస్తున్నాని, విప్ పదవిని తిరస్కరిస్తున్నందుకు క్షమించమని కోరుతున్నాని కేశినేని నాని ఓ ప్రకటనలో తెలిపారు.

ఇదిలా ఉంటే గత నాలుగు రోజుల నుంచి నాని పార్టీ మారతారని ప్రచారం జరుగుతుంది. ఆయన త్వరలోనే బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో ఆయన మొన్న విజయవాడలో పార్టీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరుకాకపోవడం, ఇప్పుడు విప్ పదవిని తిరస్కరించడం చూస్తుంటే…పార్టీ మారుతున్నారనే వార్తలకి బలం చేకూరినట్లైంది.  చూడాలి మరి రానున్న రోజుల్లో కేశినేని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

చదవండి: కేశినేని, సీఎం రమేశ్‌లకు కీలక బాధ్యతలు అప్పజెప్పిన చంద్రబాబు..
- Advertisement -