26.2 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఆసక్తికరం: అరకులో ఫాదర్ Vs డాటర్ ఫైట్! కిశోర్ చంద్రదేవ్‌కు ప్రత్యర్థిగా…

ఆసక్తికరం: అరకులో ఫాదర్ Vs డాటర్ ఫైట్! కిశోర్ చంద్రదేవ్‌కు ప్రత్యర్థిగా…

Kishor chandradev Latest News, Vizag Political Latest News, TDP Updates News, Newsxpressonline
- Advertisement -

విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల్లో పలు ఆసక్తికర పోటీలు నెలకొన్నాయి. ఒక కుటుంబానికి చెందిన వారే ఒకరిపై మరొకరు ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. తాజాగా అరకు పార్లమెంటు స్థానంలో కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌పై ఆయన కుమార్తే పోటీపడుతుండటం చర్చనీయాంశమైంది.

రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న కిశోర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. కాంగ్రెస్‌ను వీడి ఇటీవలే టీడీపీలో చేరిన ఆయనకు ఆ పార్టీ అరకు ఎంపీ సీటును కేటాయించింది.

తండ్రికి ప్రత్యర్థిగా…

అయితే, ఇన్నాళ్లూ కిశోర్‌కు రాజకీయ వారసురాలిగా భావిస్తున్న ఆయన కుమార్తె శ్రుతీదేవి మాత్రం.. కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. తాజాగా ఆ పార్టీ అరకు పార్లమెంటు స్థానానికి అభ్యర్థిగా శ్రుతీదేవిని ప్రకటించింది.

దీంతో తండ్రీ కుమార్తెల మధ్య పోరు తప్పని పరిస్థితిగా నెలకొంది. పర్యావరణ న్యాయవిద్య (ఎన్విరాన్‌మెంటల్‌ లా)ను అభ్యసించిన శ్రుతీదేవి.. గత మూడు ఎన్నికల్లో కిశోర్‌దేవ్‌ పక్షాన ప్రచార బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు మాత్రం తన తండ్రితోనే పోటీ పడుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది ఇలావుంటే, మాడుగుల నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున గవిరెడ్డి రామనాయుడు పోటీ చేస్తుండగా.. ఆయన సోదరుడు సన్యాసినాయుడు జనసేన అభ్యర్థిగా బరిలో ఉండటం గమనార్హం. విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ బరిలో ఉండగా.. బీజేపీ నుంచి పురంధేశ్వరి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే వీరి పోటీ కూడా ఆసక్తికరంగా మారనుంది.

 

- Advertisement -