21.7 C
Hyderabad
Wednesday, October 14, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ దటీజ్ పవన్ కళ్యాణ్! వ్యవసాయ కూలి కొడుక్కి జనసేన టికెట్…

దటీజ్ పవన్ కళ్యాణ్! వ్యవసాయ కూలి కొడుక్కి జనసేన టికెట్…

Janasena Party MLA from Parvatipuram News, Janasena Latest News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: అధికారంలో ఉన్నా.. లేకున్నా.. ప్రజల కోసమే పనిచేస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో తనదైన ముద్రను వేస్తున్నారు. సొంత పార్టీ వారితోపాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్ నేతలకు టికెట్లు కేటాయిస్తున్నారు. అంతేగాక, పలువురు కొత్తవారిని కూడా ప్రోత్సహిస్తున్నారు.

సామాజికవేత్తలు, విద్యావంతులు, మహిళలకు ఎక్కువ శాతం టిక్కె్ట్లు కేటాయించారు. జనసేన అభ్యర్థుల్లో ఎక్కువ మంది మధ్య తరగతి వర్గానికే చెందిన వారు ఉండటం గమనార్హం. గతంలో నాలుగు విడతల్లో 90మంది అభ్యర్థులను ప్రకటించిన పవన్.. బుధవారం రాత్రి 16మందితో ఐదో జాబితా విడుదల చేశారు.

వ్యవసాయ కూలీ కొడుక్కి టికెట్..

విజయనగరం జిల్లా పార్వతీపురం టిక్కెట్‌ను గొంగడ గౌరీ శంకరరావు అనే యువకుడికి ఇవ్వడం చర్చకు దారితీసింది. కాగా, గౌరీశంకరరావు ఓ సామాన్య రైతు కూలీ బిడ్డ కావడం గమనార్హం. గౌరీ శంకరరావు తండ్రి గుంపస్వామి వ్యవసాయ కూలీగా పనిచేస్తుండగా, తల్లి అప్పాయమ్మ కూరగాయలు అమ్ముతోంది.

తొలి నుంచీ జనసేన పార్టీలోనే పనిచేస్తున్నారు శంకర్. దీంతో ఆయన సేవలను గుర్తించిన పవన్.. గౌరీశంకరరావుకు టిక్కెట్ కేటాయించారు. పవన్ నిర్ణయంపై ఆయన అభిమానులు, జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలావుంటే, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టిక్కెట్‌ను కూడా పవన్ తన అభిమాని గేదెల చైతన్య అనే యువకుడికి కేటాయించారు.

రిటైర్ట్ ఆర్టీసీ కండక్టర్ కొడుకైన చైతన్య సీఎ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై పవన్ కళ్యాణ్ గళమెత్తిన సమయంలో చైతన్య ఆయనకు అన్నివిధాలా అండగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే పవన్ పాతపట్నం టిక్కెట్‌ను చైతన్యకు కేటాయించారు. ఇలా కొత్తతరం నాయకులను పవన్ ప్రోత్సహించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

 

- Advertisement -