- Advertisement -
కృష్టా: కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ ట్రిపుల్ ఐటీలో సీటు రాలేదనే మనస్థాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదం కృష్టా జిల్లాలోని చాట్రాయి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలోకి వెళ్ళితే….
మంజు అనే బాలిక… ఎస్‌ఎస్‌సీలో 10/10 జీపీఏ సాధించింది. అయినా ఆమెకు ట్రిపుల్ ఐటిలో సీటు రాలేదు. దీంతో మంజు తీవ్ర మనస్థాపానికి గురైంది. జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ట్రిపుల్ ఐటీ సీటు విషయమై నిన్న రాత్రి మంజు తీవ్ర అవేదనతో మాట్లాడిందని ఆమె తల్లి కన్నీరుమున్నీరవుతూ చెప్పింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -