
అమరావతి: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలవ్వడంపై….చంద్రబాబు ఈరోజు విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ లో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్…టీడీపీ 23 అసెంబ్లీ స్థానాలకు పరిమితం కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలకు సంక్షోభ సమయంలోనే చంద్రబాబు గుర్తుకు వస్తారని, అన్నీ సాఫీగా ఉన్న సమయంలో ప్రజలు వేరే పార్టీలవైపు చూస్తున్నారని విమర్శించారు. గల్లా జయదేవ్ మాట్లాడారు.
అయితే ఏపీకి ఇంకా చంద్రబాబు అవసరం ఉందని, ఆ విషయం ఏపీ ప్రజలకు త్వరలోనే తెలుస్తుందని చెప్పారు. ఇక అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు.
ఇక గత కొంతకాలంగా టీడీపీపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని గురించి గల్లా స్పందించారు. లోక్ సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినవారిలో కేశినేని నాని ముందున్నారని, పార్టీలోఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో నాని హర్ట్ అయినట్లు తనకు అనిపిస్తోందని చెప్పారు. ఏది ఏమైనా కేశినేని నాని టీడీపీని వీడరనీ, పార్టీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు.








