22.7 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ మహేశ్ బాబు అభిమానుల సాయం కోరిన గల్లా జయదేవ్

మహేశ్ బాబు అభిమానుల సాయం కోరిన గల్లా జయదేవ్

Galla Jayadev Latest News, Mahesh Babu Latest News, AP Political News, Newsxpressonline
- Advertisement -

గుంటూరు: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గల్లా జయదేవ్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారాయన. ఈ క్రమంలో గుంటూరు కొత్తపేటలో కృష్ణ, మహేష్ బాబు అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో మహేష్ బాబు అభిమానులందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబునాయుడుని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగన్‌కు ఓటేస్తే అది కేసీఆర్ కు వేసినట్టేనని, జగన్‌ను గెలిపిస్తే మాఫియా రాజ్యం వస్తుందని అన్నారు.

మహేష్ అభిమానులు మద్దతు పలకాలి..

గుంటూరులోనే కాకుండా రాష్ట్రం మొత్తమ్మీద మహేష్ బాబు అభిమానులు టీడీపీకి మద్దతు పలకాలని కోరారు. అంతకుముందు ఆయన, మహర్షి చిత్రంతో మహేష్ బాబు 25 సినిమాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేశారు.

కాగా, ఈ సమావేశానికి గల్లా జయదేవ్ తోడల్లుడు, సినీ హీరో సుధీర్ కూడా హాజరయ్యారు. జయదేవ్ కార్యదక్షత ఉన్న వ్యక్తి అని, పార్లమెంట్‌లో ప్రత్యేకహోదా గురించి పదేపదే గుర్తు చేయాల్సిన అవసరం ఉందని, అందుకు తగిన వ్యక్తి జయదేవ్ అని సుధీర్ తెలిపారు. జయదేవ్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కాగా, మహేష్‌కి గల్లా జయదేవ్ బావ అవుతారనే విషయం తెలిసిందే.వ

చదవండి: జగన్‌తో అంటకాడుతారా? అసహ్యంగా లేదూ..: ప్రధాని మోడీపై చంద్రబాబు

- Advertisement -