25.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ నాకు వేయకపోయినా పర్వాలేదు, వారికి మాత్రం..: కేఏ పాల్ అభ్యర్థన

నాకు వేయకపోయినా పర్వాలేదు, వారికి మాత్రం..: కేఏ పాల్ అభ్యర్థన

AK Paul Latest News, AP Political News, AP Vote News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: తనకు ప్రజలు ఓటు వేయకున్నా ఫర్వాలేదని… సైకిల్, ఫ్యాన్, గ్లాస్ గుర్తులకు మాత్రం వేయవద్దని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. అయితే ఈ రోడ్ షో అసాంతం నవ్వులతో సాగింది.

ఓ యువకుడు వైసీపీ జెండాను పాల్‌కు చూపించగా.. నేను వచ్చానని వైసీపీ జెండాను పీకేశారని, ఇలాంటి అద్భుతాలు ముందు ముందు ఎన్నో ఉంటాయి..’’ అని వ్యాఖ్యానించారు.

‘‘మన పార్టీ గుర్తు ఏంటి?’’

ఓ గ్రామంలో వృద్ధుడు తనకు రుణమాఫీ కాలేదని చెబుతూ, తన రుణాన్ని మాఫీ చేస్తే, మీకే ఓటేస్తానని పాల్‌తో అనగా.. వెంటనే పాల్ మన పార్టీ గుర్తు ఏంటని ప్రశ్నించారు. ఆ వృద్ధుడు సైకిల్ అనేయడంతో ఆయన అవాక్కయ్యారు. కానీ చుట్టూ ఉన్నవారు మాత్రం ఫక్కున నవ్వేశారు. 

తరువాత పాల్ మాట్లాడుతూ..  చంద్రబాబు తన మనవడికి 8 మంది సెక్యూరిటీ గార్డులను నియమించుకున్నారని, తనకు ప్రాణహాని ఉన్నా ఇద్దరు గన్‌మెన్‌లతో ప్రచారం చేసుకుంటున్నానని అన్నారు. తనకు అధికారం ఇస్తే, ఏపీని అమెరికా మాదిరిగా మారుస్తానంటూ హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

కేసీఆర్‌కు నేనంటే భయం: పవన్ కళ్యాణ్‌పై కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు

మా పార్టీ బీ ఫాంలు ఎత్తుకెళ్లింది ఆ పార్టీల దొంగలే: కేఏ పాల్ సంచలనం

ఆంధ్రా.. అమెరికా అయ్యే ఛాన్స్ లేనట్లే.. కేఏ పాల్ కథ ఇక కంచికే!?
కేఏ పాల్‌కు ఊహించని షాక్! నామినేషన్‌ తిరస్కరించిన అధికారులు, అక్కడా డౌటే…
‘‘చిరంజీవి ఇరగదీసేవాడు.. తమ్ముడికి అదీ రాదు’’: కేఏ పాల్ ఇమిటేషన్, నవ్వులే నవ్వులు..
ఏపీని అమెరికాగా మార్చేస్తా: కేఏ పాల్, రెండు స్థానాల్లోనూ పోటీ.. నాగబాబు, పవన్ కళ్యాణ్‌లతో…
స్టేట్ బ్యాంక్ లో కేఏ‌ పాల్ హల్‌చల్! ఆ డబ్బు నాదే ఇవ్వండి!
 
 
- Advertisement -