25.2 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ మంత్రులకు సీఎం వార్నింగ్: అవినీతి చేస్తే ఊస్టింగే…..

మంత్రులకు సీఎం వార్నింగ్: అవినీతి చేస్తే ఊస్టింగే…..

AP CM Jagan News, AP Cabinet Latest News, AP News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: అమరావతిలో ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఈరోజు కొత్త మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుని..వాటికి ఆమోదం తెలిపారు.

ఇక సమావేశం ముగిశాక మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యేలతో కమిటీలు వేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. మండలానికో 108, 104 వాహనాలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

ఇక గిరిజన సంక్షేమశాఖలోని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు రూ. 400 నుంచి 4,000 వరకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఆశా వర్కర్ల జీతాలు రూ. 3,000 నుంచి 10,000కు పెంపుపై నిర్ణయం జరిగిందన్నారు. సామాజిక పెన్షన్లు రూ.2,250కి పెంపునకు కేబినెట్ నిర్ణయించిందని నాని తెలిపారు.

అగ్రిగోల్డ్‌ కేసులో రూ.1,150 కోట్లు హైకోర్టులో జమ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి చెప్పారు. రూ.20 వేల లోపు డిపాజిటర్లకు చెల్లించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై.. వచ్చే కేబినెట్‌ సమావేశం నాటికి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారని మంత్రి పేర్ని నాని తెలిపారు.

అలాగే రాష్ట్రంలోని 40 వేల స్కూళ్లలో మౌలికవసతులు కల్పిస్తామని, మధ్యాహ్న భోజనం అందించేందుకు సెంట్రల్‌ కిచెన్‌ ఏర్పాటుకు నిర్ణయం జరిగిందన్నారు. అటు నష్టాలతో ఉన్న ఆర్టీసీని ఆదుకునే క్రమంలో సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని, అయితే విలీన ప్రక్రియ విధివిధానాల కోసం ఆర్థిక, రవాణాశాఖ మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు

 చదవండి: మోడీ వ్యూహం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా సుష్మస్వరాజ్…?
- Advertisement -