32.2 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ “ఇప్పటికే ఏ-1.. ఇంకా ఎన్ని కేసుల్లో అలా ఉండాలనుకుంటున్నాడో..”

“ఇప్పటికే ఏ-1.. ఇంకా ఎన్ని కేసుల్లో అలా ఉండాలనుకుంటున్నాడో..”

chandrababunaidu sensetional comments, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఏపీలో మహాకుట్రకు నాంది పలికారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ విషయం బయటపడితే ప్రజలు ఛీ కొడతారు అన్న భయం లేకుండా బరితెరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ డేటాను దొంగిలించి వైసీపీకి ఇవ్వాలనీ, టీడీపీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. ఇందుకోసం వ్యవస్థలను దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇరురాష్ట్రాల మధ్య కాకరేపుతున్న ఐటీ గ్రిడ్స్ కంపెనీ డేటా చోరీ వ్యవహారంపై చంద్రబాబు ఈరోజు అమరావతితో మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించిన సాక్ష్యాలు తనదగ్గర ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. భారతదేశ చరిత్రలోనే ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు ఎన్నడూ జరగలేదని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ చాలా కేసుల్లో ఏ-1గా ఉన్నాడనీ, ఇంకా ఎన్ని కేసుల్లో ఏ-1 ముద్దాయి కావాలనుకుంటున్నాడో తెలియదని విమర్శించారు.

కేసు పెట్టకుండానే దాడులు నిర్వహించారు…

ఆయనకు తోడుగా విజయసాయిరెడ్డి చాలా కేసుల్లో ఏ-2గా ఉన్నారని దుయ్యబట్టారు. ఈ ఏ-1, ఏ-2 వ్యక్తులకు పక్క రాష్ట్రపు పాలకులు, అధికారులు సాయం అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అధికారుల వ్యవహారశైలి దొరల దగ్గర పటేళ్లు పనిచేస్తున్నట్లు ఉందన్నారు. మళ్లీ పటేల్ వ్యవస్థను తీసుకొచ్చి రాజకీయ పార్టీలపై దాడిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఓవరాక్షన్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని స్పష్టం చేశారు.

ఈ కుట్రలో భాగంగా తొలుత ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారని చంద్రబాబు తెలిపారు. ఆ తర్వాత వ్యూహంలో భాగంగా హైదరాబాద్ లో ఎలాంటి ఫిర్యాదులు అందకుండానే ఐటీ గ్రిడ్స్ పై దాడులు నిర్వహించారని పేర్కొన్నారు. ఈ దాడుల తర్వాతే కేసు నమోదుచేశారని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి తొలి కథనం టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందన్నారు.

చదవండి: వలసల జోరు: జగన్ సమక్షంలో దాడి వీరభద్రరావు చేరిక, టీడీపీపై సంచలన వ్యాఖ్యలు
- Advertisement -