24.2 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ గెలిచేది టీడీపీయే.. కావాలనే పందేలు.. అదంతా వైసీపీ మైండ్ గేమ్: చంద్రబాబు

గెలిచేది టీడీపీయే.. కావాలనే పందేలు.. అదంతా వైసీపీ మైండ్ గేమ్: చంద్రబాబు

chandrababu comments on tdp wining
- Advertisement -

అమరావతి: ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఉదయం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో నిర్వహించిన చంద్రబాబు…వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పందేలతో వైసీపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని, నేరగాళ్లతో పోటీలో అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నేతలకి సూచించారు. ఏది ఏమైనా మరోసారి టీడీపీ నూటికి వెయ్యి శాతం విజయం సాధిస్తుందని చంద్రబాబు అన్నారు. ఇక టీడీపీ నుంచి గెలిచే ఎమ్యెల్యేలు,ఎంపిలను వైసీపీ, బీజేపీ ప్రలోభాలకి గురి చెయ్యడం మొదలుపెట్టిందని, వీటిని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇక ఎన్నికల్లో కీలక ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియకు చేరుకున్నామని కార్యకర్తలు, బూతు ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అలాగే కౌంటింగ్ రోజు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక బృందాలు ఏర్పడాలని, గతంలో కౌంటింగ్ అనుభవం ఉన్నవాళ్లనే ఎంపిక చేయాలని చెప్పారు.

ఇక ఆ బృందంలో ఒక అడ్వకేట్, ఒక ఐటి నిపుణుడు ఉండేలా  చూసుకోవాలన్నారు. అసలు కౌంటింగ్ ఏజెంట్లు మధ్యలోనే బయటకు రాకూడదని,  చివరిదాకా ఓపికగా ఉండాలని తెలిపారు.

చదవండి: ఏపీ లేటెస్ట్ సర్వే! ఏ పార్టీకి ఎన్ని సీట్లో చూడండి.?

- Advertisement -