
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన, ఆయన ఆస్తుల కేసు తదితర అంశాలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లక్ష్మీనారాయణ జగన్ ఏడాది పాలన పూర్తయ్యాక మార్కులు ఇస్తానని తెలిపారు. ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకుంటుందని, కొందరు మేనిఫెస్టోను కేవలం ఎన్నికల్లో విజయం కోసమే అనుకుంటారని అన్నారు.
అందులో చెప్పినవన్నీ చేయరని, కానీ జగన్ మేనిఫెస్టోలో ఉన్న విషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రశంసించారు.
జగన్ ఆస్తుల కేసు విచారించిన తర్వాత ఓసారి జగన్, తాను విమానాశ్రయంలో ఎదురుపడ్డామని, ‘నమస్కారం అంటే నమస్కారం’ అని పలకరించుకున్నామని లక్ష్మీనారాయణ గుర్తు చేసుకున్నారు.
తన డ్యూటీ తాను నిర్వహించానని, తనకు జగన్‌పై వ్యక్తిగత ద్వేషం, కక్ష లేదన్నారు. తాను ఫుల్ టైమ్ రాజకీయాలు చేయడానికి వచ్చానని అన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లో రాజకీయపరంగా పూర్తి పరిపక్వత కనిపించకపోవడం వల్లే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు లక్ష్మీనారాయణ వివరించారు.








