33.2 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకి బిగ్ షాక్! బీజేపీయేతర పక్షాల భేటీకి కేసీఆర్, జగన్‌కి ఆహ్వానం!

చంద్రబాబుకి బిగ్ షాక్! బీజేపీయేతర పక్షాల భేటీకి కేసీఆర్, జగన్‌కి ఆహ్వానం!

Chandrababu Naidu Varthalu, YS jagan Updates, KCR Latest Updates News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్‌: యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ నేతృత్వంలో మే 23వ తేదీన ఢిల్లీలో నిర్వహించే బిజెపియేతర పక్షా భేటికి తెలుగు రాష్ట్రాల నుండి తెలంగాణ సిఎం కెసిఆర్‌, ఏపి విపక్ష నేత జగన్‌కి ఆహ్వానాలు అందాయట అయితే ఈ సమావేశనకి వీరిని ఆహ్వానిస్తూ సోనియా గాంధీ స్వయంగా లేఖలు రాశారని సమాచారం.

మే 23వ తేదీనే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నందున అధికార బీజేపీకి ఫలితాలు అనుకూలంగా లేకపోతే భవిష్యత్తు కార్యాచరణకు ఈ సమావేశం దిశానిర్దేశం చేసేలా ఉండాలనేది సోనియా ఆలోచనగా తెలుస్తోంది.

చదవండి: ఏపీలో జగన్ తెలంగాణలో చంద్రబాబు! ఏం చేస్తున్నారో చూడండి?

అందుకే ఇటు యూపీయే, అటు ఎన్టీయేలో భాగస్వాములుకాకుండా తటస్థంగా ఉన్న పార్టీలు సమావేశానికి హాజరు కావాలని సోనియా ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే టిడిపితో పాటు టిఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌సిపిలకు కూడా ఆహ్వానాలు అందినట్లు సమాచారం.

అయితే బీజేపీయేతర పక్షాలను ఏకం చేసేందుకు కాంగ్రెస్‌తో కలిసి కీలకంగా వ్యవహరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో కలిసి సమావేశంలో పాల్గొనేందుకు సిఎం కెసిఆర్‌, జగన్‌లు అంగీకరిస్తారా ,లేదా అనేది ఇప్పుడు చర్చినియాంశంగా మారింది. అలాగే ఒకరంటే ఒకరు మండిపడుతున్న ఈ సమయంలో ఒకేసారి మీటింగ్ లో పాల్గొనడం అసాధ్యం అని అందరూ చర్చించుకుంటున్నారు.

చదవండి: ఫలితాలకు ముందు జగన్ మౌనానికి కారణమేమిటో?
- Advertisement -