
అమరావతి: టాలీవుడ్ అగ్రనటుడు,టీడీపీ హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ..ప్రచారంలో భాగంగా హిందూపురం నూగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య..వైసీపీ, జనసేన పార్టీలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
ముఖ్యంగా వైసీపీ పార్టీ హత్యా రాజకీయాలకు పెట్టింది పేరన్నారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన పథకాలు, రాష్ట్ర అభివృద్దే టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తుందని జోస్యం చెప్పారు. అంతేకాదు రాష్ట్రంలో తెలుగు దేశానికి కాకుండా మరెవరికి ఓటేసిన ఇన్ డైరెక్ట్‌గా బీజేపీకి ఓటేసినట్టేనన్నారు. హిందూపురంలో జరిగిన అభివృద్దే మళ్లీ తనను మంచి మెజారిటీతో గెలుపిస్తుందని బాలయ్య ఆశాభావం వ్యక్తం చేసారు.
హిందూపురం ప్రచారంలో భాగంగా బాలయ్య నూగురు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ, జనసేన పార్టీలపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.నియోజవర్గానికి తాను ఇచ్చిన హామిలన్నింటినీ నెరవేర్చానన్నారు. ఇక్కడ ఆసుపత్రి నిర్మించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాన్నారు. త్వరలోనే బసవతారకం క్యాన్సర్ హాస్పటిల్‌ను ఇక్కడ నిర్మిస్తానని చెప్పుకొచ్చారు.
మరోవైపు రాష్ట్రంలో కొత్త పార్టీల ప్రభావం ఏమాత్రం ఉండదని ఇన్ డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ జనసేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరోవైపు బాలయ్య ఈ రోజు ఎమ్మెల్యేగా నామినేషన్ వేసారు. ఇంకోవైపు బాలయ్య పెద్దల్లుడు చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా ఈ రోజే ఎన్నికల అధికారికి తన నామినేషన్ సమర్పించారు.









BbBalaih kuda Ysr partyni vimarsistunndu YSR aaroju days talchakunte life imprisoned aiyyevadu