23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఏపీ టెన్త్ రిజల్ట్: తూర్పుగోదావరి టాప్‌.. నెల్లూరు లాస్ట్!

ఏపీ టెన్త్ రిజల్ట్: తూర్పుగోదావరి టాప్‌.. నెల్లూరు లాస్ట్!

AP SSC Latest News, SSC Result Latest News, AP News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ టెన్త్ ఫలితాల్లో మొత్తం 94.88 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఈ ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా టాప్‌లో నిలిచింది. తూర్పు గోదావరి జిల్లా 98.19 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానం సాధించింది.

తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 5456 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించడం విశేషం. ఇక రెండో స్థానంలో కృష్ణా జిల్లా నిలిచింది. ఇక చివరి స్థానం నెల్లూరు జిల్లాకు దక్కింది. నెల్లూరు జిల్లాలో 83.19 శాతం మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారు.

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలకు మొత్తం 6,32,898 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 6,30,082 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 6,19,494 మంది రెగ్యులర్ విద్యార్థులు, 10,588 ప్రైవేట్ విద్యార్థులు. ఏపీ టెన్త్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించడం విశేషం.

బాలికల ఉత్తీర్ణత శాతం 95.09 కాగా, బాలుర ఉత్తీర్ణతా శాతం 94.68. ఏపీ టెన్త్ ఫలితాల్లో 98.19 శాతంతో మొదటి స్థానంలో తూర్పు గోదావరి జిల్లా నిలవగా, చివరి స్థానంలో 83.19 శాతంతో నెల్లూరు జిల్లా ఉంది. 5464 స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, 3 స్కూళ్లలో ఉత్తీర్ణత సున్నా శాతం.

- Advertisement -