28.2 C
Hyderabad
Tuesday, November 24, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఏపీ జాతీయ రికార్డ్: 9.9 శాతం గ్రోత్ రేట్‌తో దూకుడు!

ఏపీ జాతీయ రికార్డ్: 9.9 శాతం గ్రోత్ రేట్‌తో దూకుడు!

- Advertisement -

అమ‌రావ‌తి: దేశీయ ఆర్థిక రంగంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. జాతీయ సగటు కంటే వేగంగా అడుగులు వేస్తూ వరుసగా రెండో ఏడాది కూడా విపరీతమైన గ్రోత్ రేట్‌తో సత్తా చాటింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జులై నివేదికల ప్రకారం… ఏపీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) ఏకంగా 9.9 శాతానికి ఎగబాకింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతోందని ప్రణాళికా విభాగం అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సమర్పించిన నివేదిక తేల్చిచెప్పింది.

రైతన్న నుంచి ఐటీ వరకు.. అన్నింటిలోనూ బంపర్ గ్రోత్
రెండో త్రైమాసికంలో రాష్ట్రంలోని ప్రతి రంగమూ అద్భుతమైన పనితీరును కనబరిచింది. వ్యవసాయ రంగంలో 13.5 శాతం, పారిశ్రామికంలో 10.6 శాతం, సేవా రంగంలో 9.9 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. సుగంధ ద్రవ్యాల దిగుబడి రికార్డు స్థాయిలో 304 శాతం పెరగ్గా, వాణిజ్య వాహనాల విక్రయాల్లో 51.6 శాతం జంప్ కనిపించింది. ఐటీ విభాగానికి వస్తే ఎస్‌టీపీఐ ఎగుమతులు 32.2 శాతానికి చేరాయి. అత్యాధునిక టెక్నాలజీతో లీకేజీలు అరికట్టడంతో జీఎస్టీ వసూళ్లు రూ. 13,282 కోట్లకు (21 శాతం పెరుగుదల) చేరాయి. ప్రభుత్వం ఆమోదించిన రూ. 2.88 లక్షల కోట్ల మేగా ప్రాజెక్టులలో దాదాపు 75.4 శాతం పెట్టుబడులు ఇప్పటికే కార్యరూపం దాల్చాయి.
ఎల్ నినో ముప్పు ఉన్నా తగ్గేదే లేదు – సీఎం ప్లాన్
ఆర్థిక నివేదికను పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎల్ నినో వల్ల వర్షాలు తగ్గి, శ్రీశైలం, సాగర్ వంటి డ్యామ్‌లు నిండకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూనే… ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా ప్రగతి చక్రాలు ఆగకూడదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర జీఎస్‌డీపీని 15 శాతానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. మండలాల వారీగా మైక్రో-లెవల్ ప్రణాళికలు వేసి, ధరల భారం ప్రజలపై పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
- Advertisement -