22.7 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ తొలిసారి అమరావతిలో ‘గవర్నర్ ఎట్ హోమ్’… హాజరైన జగన్, చంద్రబాబు దూరం…

తొలిసారి అమరావతిలో ‘గవర్నర్ ఎట్ హోమ్’… హాజరైన జగన్, చంద్రబాబు దూరం…

ap-governor-at-home-at-amaravathi
- Advertisement -

అమరావతి: 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం అమరావతిలోని రాజ్‌ భవన్‌లో ‘గవర్నర్ ఎట్ హోమ్’ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు హాజరయ్యారు.

రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి ఏపీలో ‘గవర్నర్ ఎట్ హోమ్’ కార్యక్రమం జరగడం విశేషం. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ ఉండటంతో ఎట్ హోమ్ కార్యక్రమం హైదరాబాద్‌లోనే జరిగేది. ఇక ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డేల నాడు ఈ ఎట్ హోమ్ కార్యక్రమం జరిగేది.

ఎట్ హోమ్ కార్యక్రమం ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని పెంపోందించడంతో పాటు రాజకీయ చర్చలకు సైతం వేదికగా నిలిచేది. అయితే తరువాతి కాలంలో.. హైకోర్టు సహా ఏపీ పాలనా యంత్రాంగం మొత్తం అమరావతిలో కేంద్రీకృతం కావడంతో ఇరు రాష్ట్రాలకు వేరు వేరు గవర్నర్లను నియమించాలని పలువురు కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు.

ఇటీవల కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు విడివిడిగా గవర్నర్లను నియమించారు. ఈ క్రమంలో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించారు.

దీంతో గురువారం తొలిసారిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో అమరావతిలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని  నిర్వహిస్తున్నారు.

చంద్రబాబు దూరం…

అయితే రాజ్‌భవన్‌లో జరుగుతున్న ఎట్ హోమ్ కార్యక్రమానికి టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దూరంగా ఉన్నారు. కొద్దిరోజులుగా చేతినొప్పితో బాధపడుతున్న ఆయనకు రెండు రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో బాబు హైదరాబాద్‌కు చేరుకున్నారు. దీంతో ఆయన అమరావతిలో ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరుకావడం లేదని సమాచారం.

- Advertisement -