లోకేష్‌కి మరో కొత్త పేరు! ఆటాడేసుకుంటున్న వైసీపీ శ్రేణులు!!

11:55 am, Fri, 19 April 19
somu hot comments on lokesh , newsxpress.online

అమరావతి: నారా లోకేశ్.. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి.  మొదట పార్టీ బాథ్యతలు చూసిన ఈ యువ నాయకుడు.. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషించారు. తన తండ్రి తర్వాత సెకండ్ ప్లేస్‌లో విధులు నిర్వర్తించారు.

మంచి చదువు, లోకజ్ఞానం, తెలివి తేటలు ఉన్నా, కేవలం ప్రసంగాల్లో దొర్లిన తప్పుల కారణంగా ఎన్నో ఇబందుల పాలయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏ నిమిషంలో లోకేశ్‌‌ను పప్పు అన్నారో తెలియదు కానీ, ఆ టైటిల్ బాగా పాపులర్ అయ్యింది. వైసీపీ శ్రేణులంతా ఆ పేరుతోనే లోకేశ్‌ను ఇప్పటికీ వెటకారం చేస్తున్నారు.

లోకేశ్  తింగర మంగళం…

ఇప్పుడు బీజేపీనేత సోము వీర్రాజు మరో కొత్త పేరు పెట్టారు లోకేశ్‌కు. అది తింగర మంగళం. లోకేశ్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం వల్ల ఈ టైటిల్ ఇంకాస్త బాగా సూట్ అవుతుందనుకున్నారో ఏమో, సోము వీర్రాజు అలా పిలిచేశారు.

దీంతో వైసీపీ శ్రేణులు, టీడీపీ వ్యతిరేక వర్గాలు ఈ పేరును పాపులర్ చేస్తున్నాయి. ఏదేమైనా ఇలా వ్యక్తులను వెటకారం చేసే రీతిలో దుష్ప్రచారం చేయడాన్ని నిరసించాల్సిందే. ఇదే సమయంలో లోకేశ్ వంటి నేతలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది.

సంబంధిత వార్తలు

ఐటీ మంత్రిగా చెబుతున్నా ప్రపంచంలోని ఏ టెక్నాలజీని అయినా హ్యాక్ చేయవచ్చు!
‘‘లోకేష్ మాత్రమే కాదు.. ఒక్క టీడీపీ మంత్రి కూడా గెలవడు.. కావాలంటే రాసిస్తా..’’
లోకేష్ ఓటమిపై పందెం రాయుళ్ల జోరు!