24.2 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ కలవకుండానే కలిశామంటారా?: వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై మందడం మహిళలు ఫైర్

కలవకుండానే కలిశామంటారా?: వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై మందడం మహిళలు ఫైర్

- Advertisement -

అమరావతి: తాటికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై మందడం మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి మార్పును నిరసిస్తూ మందడం రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.

నిన్న మహిళలు, రైతులు కలిసి భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు రాజధానులు వద్దని, అమరావతి చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

రాజధాని కోసం గత నెలు రోజులుగా ఆందోళనలు చేస్తున్నా, 18 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనీసం పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయినప్పటికీ ఆమె తమను కలిసి పరామర్శించినట్టు చెప్పడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను కలవలేదని తేల్చి చెప్పారు. అమరావతి కోసం తమ పోరాటం కేవలం తమకోసం మాత్రమే కాదని, ఐదుకోట్ల ఆంధ్రుల కోసమని మహిళలు పేర్కొన్నారు.

- Advertisement -