- Advertisement -
అమరావతి: వైసీపీ కీలకనేత విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీ అన్నా ఆ పార్టీ నేతలన్నా ఏ స్థాయిలో తన విమర్శల జల్లును కురిపిస్తారో అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే గత కొన్ని రోజుల నుంచి టీడీపీ మరియు వైసీపీ నేతల మధ్య తీవ్ర స్థాయి విమర్శలు చేసుకున్నారు.
అయితే తాజాగా టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ విషయంలో చంద్రబాబును ఉద్దేశించి విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్లు కలకలాన్ని రేపాయి.
చదవండి: జనసేన అభ్యర్థులతో పవన్ భేటీ! భవిష్యత్ కార్యాచరణపై చర్చ…
దీనితో తెలుగుదేశం పార్టీకి చెందిన నేత మాల్యాద్రి శ్రీరామ్ విజయసాయి రెడ్డిపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. అసలు రవిప్రకాష్ కు చంద్రబాబుకి సంబధం లేదని అయినా సరే విజయసాయి రెడ్డి కావాలనే ఇలాంటి నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పుడు విజయసాయి రెడ్డి ఒక పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తున్నాడని,ఏ1 మరియు ఏ2 ముద్దాయిలు అయినటువంటి జగన్ మరియు విజయసాయి రెడ్డిలకు అందరూ అవినీతి పరులులాగానే కనబడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అలాగే ఇప్పటి వరకు చంద్రబాబు పై చేసిన ఒక్క ఆరోపణకు కూడా విజయసాయి రెడ్డి ఆధారం చూపించని దుర్ఘతిలో ఉన్నరని విజయసాయి రెడ్డిపై మాల్యాద్రి విష్ణు ఘాటు విమర్శలు చేసారు.
- Advertisement -








