
- Advertisement -

హైదరాబాద్: తెలుగు సుప్రసిద్ధ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాతృమూర్తి శకుంతలమ్మ ఇవాళ తుదిశ్వాస విడిచారు. నెల్లూరు తిప్పరాజువారి వీధిలోని నివాసంలో ఆమె మరణించారు. శకుంతలమ్మ వయసు 89 సంవత్సరాలు.
వయోభారంతో ఆమె కన్నుమూశారని కుటుంబసభ్యులు చెప్పారు. ప్రస్తుతం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక కార్యక్రమం నిమిత్తం లండన్‌లో ఉన్నారు. తల్లి మరణ వార్త తెలియగానే ఆయన హుటాహుటిన నెల్లూరుకి పయనమైనట్లు తెలుస్తోంది. బాలు తల్లి మరణవార్త తెలుసుకున్న పలువురు ఆమెకి నివాళులు అర్పిస్తున్నారు. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నారు.
- Advertisement -








