24.2 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు లాక్‌డౌన్‌ను బ్రేక్ చేసి మరీ.. స్నేహితుడి ఇంటికెళ్లిన విజయ్ సేతుపతి! ఎందుకంటే…

లాక్‌డౌన్‌ను బ్రేక్ చేసి మరీ.. స్నేహితుడి ఇంటికెళ్లిన విజయ్ సేతుపతి! ఎందుకంటే…

kollywood-star-hero-vijay-sethupathi-breaks-lock-down-and-went-to-friend-s-house
- Advertisement -

చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి శుక్రవారం లాక్‌డౌన్‌ను సైతం లెక్కచేయకుండా తన స్నేహితుడి ఇంటికెళ్లారు. ఒకవైపు కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం లాక్‌డౌన్ విధిస్తే.. స్టార్ హీరో అయి ఉండి, ఇలా రిస్క్ చేయడం ఏమిటి? మరీ అంత అవసరం ఏమొచ్చింది అని ఆశ్చర్యపోతున్నారా?

చదవండి: ఇన్‌స్టాలో తన ఇంటి వీడియోను షేర్ చేసిన చిరంజీవి.. క్షణాల్లోనే వైరల్!

కానీ నిజం తెలిస్తే.. ఆశ్చర్యపోవడం కాదు, మీరంతా ఆయన్ని అభినందించకుండా ఉండలేరు. అసలేం జరిగిందంటే.. తమిళనాడుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, రచయిత అయిన నెల్లాయ్ భారతి కన్నుమూశారు.  కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన శుక్రవారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 

ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు నెల్లాయ్ భారతి భౌతికకాయాన్ని పోరూర్‌లోని ఆయన నివాసానికి తరలించగా, బంధుమిత్రులు, పలువురు సినీ ప్రముఖులు భౌతిక కాయాన్ని సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు. 

చదవండి: షూటింగ్ కోసం వెళ్లి ఎడారిలో చిక్కుకున్న హీరో.. రక్షించమంటూ వేడుకోలు

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతికి నెల్లాయ్ భారతి పాత స్నేహితుడు. స్నేహితుడి మరణవార్త తెలియగానే విజయ్ ఆగలేకపోయారు. ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంత్యక్రియల్లోనూ పాల్గొనడమే కాదు, ఆ ఖర్చును కూడా తానే భరించారు.

అంతేకాదు, భారతి కుటుంబానికి ఆర్థిక సాయం కూడా చేసి విజయ్ సేతుపతి తన పెద్ద మనసును చాటుకున్నారు. స్నేహితుడ్ని చివరిసారి చూసుకునేందుకు లాక్‌డౌన్ ఉన్నప్పటికీ రిస్క్ తీసుకుని వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలిచిన విజయ్ సేతుపతిని చాలామంది ప్రశంసించారు. 

చదవండి: సోషల్ మీడియాతో కన్నీరు పెట్టిస్తున్న అక్కాచెల్లెళ్లు!
- Advertisement -