- Advertisement -

ప్రస్తుతం ఈ బ్యూటీ కొంతకాలంగా బెంగళూరు, మంగుళూరు పరిసరాల్లోనే ఉంటోంది. తన ఫ్యామిలీ వేడుకల్లో పాల్గొని.. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతోంది. ఆ క్రమంలో హైదరాబాద్‌కు కాస్త దూరమైంది. తాజాగా కర్నాటక ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో టచ్‌లోకి వచ్చింది.
తన ట్విటర్ పేజీ ద్వారా అభిమానులకు దర్శనమిచ్చింది అనుష్క. వేలికి సిరాతో కనిపిస్తున్న పిక్‌ని పోస్ట్ చేసిన స్వీటి కన్నడ ప్రజలనూ ఓటేయమని కోరింది. దీంతో ఎట్టకేలకు అమ్మడి జాడ తెలిసిందని ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -