అదితి గోవిత్రికర్ నటించిన ఏకైక తెలుగు చిత్రం తమ్ముడు. తర్వాత అక్కడక్కడా హిందీ చిత్రాల్లో మెరిసింది ఈ భామ. కొన్ని చిత్రాల్లో చాలా ఇంపార్టెంట్ రోల్స్ కూడా చేసింది. పవన్ కల్యాణ్ సరసన ప్రీతీ జింగ్యానీతోపాటు తమ్ముడు చిత్రంలో నటించిన తర్వాత ఇక తెలుగు సినిమాల్లో ఎక్కడా కనిపించలేదు. కొన్ని సినిమాల్లోనే చేసినప్పటికీ అదితి పాత్రల్లో అందర్నీ బాగా మెప్పించింది. బుల్లితెరమీద కూడా కొంతకాలం ఓ మెరుపులా మెరిసింది.
ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్న అదితి గోవిత్రికర్ ఈ మధ్య ఒక వెకేషన్‌లో ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అందులో పెద్ద విశేషం ఏముంది అంటారా? విశేషమే మరి.. ఎందుకంటే 42 ఏళ్ల వయసులో కూడా బికినీలో ఉన్న తన ఫోటోలను పోస్ట్ చేస్తే కుర్రకారు ఎగబడి చూశారు. చూడడమే కాదు, ఆ ఫొటోలను ఇతరులకు షేర్ చేసేశారు.
ఇంకేముంది? సోషల్ మీడియా నుంచి అన్ని ప్రసార మాధ్యమాల్లోకి నిమిషాల్లో ఇది పాకేసింది. 42 ఏళ్ల వయసులో కూడా అదితి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బికినీ అందాలు కుర్రాళ్ల మతి పోగొట్టేస్తుంటే తను మాత్రం చాలా సింపుల్‌గా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నానంటూ కామెంట్ చేస్తోంది. ఏదేమైనా “బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్”.