ప్రభుదేవాతో పెళ్లికి నేను రెడీ: హీరోయిన్ నికీషా పటేల్

- Advertisement -

నటుడు, నృత్యదర్శకుడు, దర్శకుడు అయిన ప్రభుదేవాకు, తమ కుటుంబానికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని హీరోయిన్ నికీషా పటేల్ తెలిపింది. ప్రభుదేవాతో కలసి నటిస్తారా? అని తనను ఎంతో మంది అడుగుతున్నారని.. అవకాశం రావాలేగానీ నటించడమేకాదు, ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి కూడా తాను రెడీ అని చెప్పింది.

నిజానికి ప్రభుదేవాకు ఎప్పుడో పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల భార్యతో ఆయన విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్ నయనతారను ప్రేమించి, పెళ్లి చేసుకోవాలనుకున్నప్పటికీ… చివరి నిమిషంలో అది ఆగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా నికీషా పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరోవైపు, సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని తాను ఎప్పుడో చెప్పానని నికీషా తెలిపింది. అవకాశాలు కావాలంటే పడకగదికి రావాలంటూ కొందరు బహిరంగంగానే అడుగుతారని చెప్పింది. ఇది అన్ని రంగాల్లో జరుగుతున్నదే అయినప్పటికీ… సినీరంగం కాబట్టి ఎక్కువ ప్రచారం జరుగుతోందని తెలిపింది.

- Advertisement -