
ఢిల్లీ: హాంకాంగ్కు చెందిన దిగ్గజ మొబైల్స్ తయారీదారు ఇన్ఫినిక్స్ తన నూతన స్మార్ట్ఫోన్ హాట్ 7 ప్రొను తక్కువ ధరకే భారత మార్కెట్లో విడుదల చేసింది.
6జీబీ ర్యామ్ కెపాసిటీ గల ఈ ఫోన్ రూ.9,999 ధరకు వినియోగదారులకు ఈ నెల 17వ తేదీ నుంచి లభ్యం కానుంది. అయితే జూన్ 21వ తేదీ వరకు ఆఫర్ కింద ఈ ఫోన్ను రూ.1వేయి తగ్గింపు ధరకు.. అంటే.. రూ.8,999 ధరకు అందివ్వనున్నారు.
ఇక ఈ ఫోన్ లో డెడికేటెడ్ మెమొరీ, డ్యుయల్ సిమ్ కార్డు స్లాట్లను ఏర్పాటు చేశారు.
ఇన్ఫినిక్స్ హాట్ 7 ప్రొ ఫీచర్లు…
6.19 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే
1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్
6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్
13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు
ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ
బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.







