గవర్నర్, కేసీఆర్, జగన్ ‘మహాశివరాత్రి శుభాకాంక్షలు’

jagan-Kcr
- Advertisement -

హైదరాబాద్: తెలుగు ప్రజలకు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వేర్వేరుగా మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో ఐకమత్యాన్ని, సోదరభావాన్ని మహాశివరాత్రి పెంపొందిస్తుందని గవర్నర్ చెప్పాడు.

అందరూ సంతోషంగా ఉండాలి..

ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యంతో తులతూగేలా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను దీవించాలని శివుడిని వేడుకుంటున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలందరూ అందంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు.

11 మాస శివరాత్రుల్లో ఎంతో ఔన్నత్యం కలిగిన మహాశివరాత్రిని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో, పరమ పవిత్రంగా జరుపుకుంటారని పేర్కొన్న జగన్, ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభం జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

చదవండి: ఇండియా టుడే కాంక్లేవ్‌: సీఎం పదవి, హోదా, పొత్తులపై జగన్ కీలక వ్యాఖ్యలు

- Advertisement -