రీ-వెరిఫికేషన్‌లో అనామిక పాస్.. మరి ఇంటర్ బోర్డు అధికారులు ఆమె ప్రాణాన్ని తెచ్చివ్వగలరా?

Telangana Latest Updates, Inter result news, Telangana Inter Board News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: గత ఏప్రిల్ 18న వెలువడిన తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 3లక్షల మందికి పైగా విద్యార్దులు ఫెయిలైన విషయం తెలిసిందే. దీంతో మనస్తాపం చెందిన కొందరు విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 20 మందికి పైనే విద్యార్దులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

అయితే చాలామంది తెలంగాణ ఇంటర్ బోర్డు చేసిన తప్పిదాల వలన ఫెయిల్ అయ్యారు. దీంతో ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంపై.. విద్యార్దులు, తల్లిదండ్రులు, పలు రాజకీయ పార్టీలు, విద్యార్ధి సంఘాలు ఆందోళనలు చేయడంతో…ప్రభుత్వం ఫెయిల్ విద్యార్డుల పేపర్లని ఉచితంగా రీ-వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఫలితాలని వెల్లడించాలని ఆదేశించింది.

ఈ క్రమంలోనే తాజాగా రీ-వెరిఫికేషన్ ఫలితాలు వెల్లడి కాగా, అందులో కొందరు విద్యార్దులు పాస్ అయ్యారు. అలాగే ఫెయిల్ అయ్యాను అనుకుని ఆత్మహత్య చేసుకున్న అనామిక అనే విద్యార్దిని కూడా రీ వెరిఫికేషన్‌లో పాస్ అయింది. అనామికకి మొదట తెలుగు భాషలో 20 మార్కులు వచ్చి ఫెయిలైంది. ఇక రీ వెరిఫికేషన్‌లో ఆమెకు 48 మార్కులు వచ్చి పాస్ అయింది.

కానీ, పాస్ అయ్యాను అనే ఆనందం పొందడానికి అనామిక ఈ లోకంలేదు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి బలైంది.

చదవండి: తెలంగాణ ఇంటర్ ఫలితాలు: రీవెరిఫికేషన్‌లో 1137 మంది పాస్…
- Advertisement -