26.3 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఘోరం: బౌద్ధారామాల వద్ద యువతిపై అత్యాచారం, హత్య, పక్కనే తీవ్రగాయాలతో యువకుడు

ఘోరం: బౌద్ధారామాల వద్ద యువతిపై అత్యాచారం, హత్య, పక్కనే తీవ్రగాయాలతో యువకుడు

murder
- Advertisement -

పశ్చిమ గోదావరి: జిల్లా కామవరపుకోట మండలంలోని గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. ఆమె మృతదేహం వద్దే ఆమె వెంట వచ్చిన యువకుడు తీవ్ర గాయాలతో పడివుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. ప్రముఖ పర్యాటక స్థావరం గుంటుపల్లి బౌద్ధారామాలకు ప్రతిరోజూ పర్యాటకులు వస్తుంటారు. ఆదివారం కూడా సుమారు 40 మంది పాఠశాల విద్యార్థులు బౌద్ధారామాలను దర్శించడానికి వెళ్లారు. వారితోపాటు మూడు జంటలు కొండపైకి వెళ్లినట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు.

కొంతసేపటికి విద్యార్థులు, రెండు జంటలు తిరిగి వెళ్లిపోయాయి. ఓ యువతి, యువకుడు ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో సిబ్బంది పైకి వెళ్లి చూశారు. యువతి తీవ్ర గాయాలతో మృతిచెంది ఉండగా, ఆమె పక్కనే యువకుడు తీవ్ర గాయాలతో పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

అనుమానాస్పదం..

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించారు. యువతి తీవ్ర గాయాలతో దుస్తులు లేకుండా మృతిచెంది ఉండటంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన యువకుడు నవీన్‌ భీమడోలు మండలం అజ్జావారిగూడేనికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతడు ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నట్లు సమాచారం. యువకుడు కోలుకున్న తర్వాత అతడ్ని నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించనున్నట్లు పోలీసులు తెలిపారు.

చదవండి: విషాదం: ముఖానికి కవర్, ఉరి వేసుకుని లేడీ టెక్కీ ఆత్మహత్య

- Advertisement -