ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘ఎల్‌జీ’ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. వీ సిరీస్‌లో నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఎల్‌జీ ‘వీ40 థీన్‌క్యూ’ పేరుతో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు వెనుక వైపు మూడు కెమెరాలు, ముందు రెండు కెమెరాలు, మొత్తం ఐదు కెమెరా లెన్సెస్‌తో విడుదల చేసింది. ఇది నాలుగు రంగులలో అందుబాటులోకి వచ్చింది.
ఐ ఫొన్ ఎక్స్ ఎస్ మాక్స్, శాంసంగ్ గెలాక్సీ నోట్9 లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాల అంచనా. అమెరికాలో అక్టోబర్ 19 నుండి దీని అమ్మకాలు మొదలుకానున్నాయి. అయితే మన దేశంలో ఇది ఎప్పుడు విడుదల అయ్యేది ఇంకా ప్రకటించ లేదు. ఎల్‌జీ వీ 40 థిన్‌క్యూ ధర సుమారు 67,980 రూపాయలు ఉండవచ్చు.
ఈ ఎల్‌జీ వీ 40 థిన్‌క్యూ లో ఉండే ఫీచర్లు..
6.4 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌పే, అండ్రాయిడ్ ఓరియో 8.1, 3120 x 1440 రిజల్యూషన్, స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 2+16+12 ఎంపీ రియర్ కెమెరా, 5+8 ఎంపీ సెల్పీ కెమెరా, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టొరేజ్ (ఎస్‌డీ కార్డ్‌తో 2 టీబీ దాకా విస్తరించుకునే అవకాశం), 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ.