
- Advertisement -

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పెనుకొండలో ఏర్పాటైన కియా మోటార్స్ కార్ల పరిశ్రమలో తయారైన తొలికారు విడుదలకు సిద్ధమైంది. జనవరి 29న సీఎం చంద్రబాబు నాయుడు, కియా మోటార్స్ ప్రతినిధుల చేతుల మీదుగా ఈ కారును విడుదల చేయనున్నారు.
ఈ క్రమంలో కియా తొలి కారుకు పరిశ్రమలో తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒక కొత్త మోడల్ కారును మార్కెట్‌లోకి విడుదల చేసేలా పరిశ్రమలో అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీ యంత్రాలు ఉపయోగిస్తుండటం గమనార్హం.
పరిశ్రమలో అనంతపురం కార్మికుల చేతుల మీదుగా బిగించిన కియా తొలి కారును సీఎం విడుదల చేసి, నడపనున్నారు. ఇందుకోసం కియా తొలికారుకు పరిశ్రమలో ట్రాక్‌పై ట్రయల్ రన్ నిర్వహించారు. కాగా, కియా మోటార్స్ ప్రపంచంలో 8వ అతిపెద్ద వాహనాల తయారీ సంస్థ. ప్రస్తుతం కియా మోటార్స్ ఎలక్ట్రానిక్ వాహనాలు తయారు చేసే పనిలో నిమగ్నమైంది.
- Advertisement -








