

విశాఖపట్నం: ‘విశాఖ నగరం అద్భుతమైన ప్రదేశమని, ఇక్కడికి రావడం తనకెంతో ఇష్టమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్‌కు సీఎం చంద్రబాబు స్పందించారు. విశాఖ నగరం ప్రపంచం ప్రేమించే గమ్యస్థానం అవుతున్నందుకు సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
విశాఖలో బుధవారం జరగనున్న భారత్-వెస్టిండీస్ రెండో వన్డేలో కోహ్లీ సేన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ట్విట్టర్లో సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.
వెస్టిండీస్‌తో రెండో వన్డే కోసం కోహ్లీ సేన విశాఖపట్టణం చేరుకున్న విషయం తెలిసిందే. సరిగ్గా పది నెలల తర్వాత విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌తో స్థానికంగా సందడి మొదలైంది. ఏసీఏ-వీడీసీఏ మైదానంలో భారత్ ఏడు మ్యాచ్‌లాడగా.. ఆరింట్లో నెగ్గింది. 2013లో ఎదురైన ఏకైక ఓటమి కూడా విండీస్‌పైనే కావడం గమనార్హం.
ఈ మైదానంలో టాస్ ఓడిన జట్టు ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్‌ను కూడా గెలవక పోవడం విశేషం.
What a stunning place.? Love coming to Vizag. ?✌ pic.twitter.com/ACxmWHoBte
— Virat Kohli (@imVkohli) October 23, 2018
Glad that Visakhapatnam is emerging out to be the loved destination both nationally and globally. Wishing @imVkohli and the team a great match tomorrow. https://t.co/NXKw6cxLRg
— N Chandrababu Naidu (@ncbn) October 23, 2018








