
అమరావతి: విశాఖపట్టణంలో రసాయన వాయువు లీకేజ్ ఘటనను ఏపీ హైకోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘాలు సుమోటోగా తీసుకున్నాయి.
ప్రభుత్వానికి ఈ రెండూ నోటీసులు జారీ చేశాయి. మీడియా వార్తల ఆధారంగా స్పందించిన హైకోర్టు, మానవహక్కుల సంఘాలు దీనిని సుమోటోగా స్వీకరించాయి.
ఈ ఘటనలో బాధ్యుల పై ఎఫ్ఐఆర్ నమోదు వివరాలు, జరుగుతున్న దర్యాప్తు గురించి 4 వారాలలో వివరించమని ఏపీ డీజీపీని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది.
కేంద్ర కార్పొరేట్ వ్యవహరాల మంత్రిత్వ శాఖ సెక్రటరీ ద్వారా ఈ పరిశ్రమ స్థాపనలో అన్ని నియమనిబంధనలు పాటించారా? లేదా? అనే అంశాన్ని విచారణ జరపాలని కమిషన్ ఆదేశించింది.
నాలుగు వారాలలో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని కేంద్ర కార్పొరేట్ వ్యవహరాల మంత్రిత్వ శాఖను కమిషన్ ఆదేశించింది.
ఇక విశాఖ గ్యాస్ లీక్ ప్రమాద ఘటనను సుమోటోగా తీసుకున్న హైకోర్టు, ప్రమాదంపై విచారణ చేపట్టి వచ్చే వారానికి విచారణ వాయిదా వేసింది. ప్రమాద ఘటనపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.








