31.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ గ్యాస్ లీకేజి దుర్ఘటన: విశాఖ చేరుకున్న సీఎం జగన్, కేజీహెచ్‌లో బాధితులకు పరామర్శ…

గ్యాస్ లీకేజి దుర్ఘటన: విశాఖ చేరుకున్న సీఎం జగన్, కేజీహెచ్‌లో బాధితులకు పరామర్శ…

ap cm ys jagan in vizag kgh
- Advertisement -

విశాఖపట్నం: వైజాగ్‌ ఆర్ఆర్ వెంకటాపురంలో గురువారం తెల్లవారుజామున ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువు లీకైన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హుటాహుటిన విశాఖకు చేరుకున్నారు. 

ప్రత్యేక హెలీకాప్టర్‌లో విశాఖ చేరుకున్న ఆయన.. దిగగానే నేరుగా కేజీహెచ్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. 

బాధితులకు అందుతున్న చికిత్సపై అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అందరికీ మెరుగైన వైద్యం అందించాలంటూ వైద్యులకు జగన్ సూచించారు.

అంతకుముందు.. తాడేపల్లిలోని తన నివాసంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం జగన్.. విశాఖలో దిగిన వెంటనే అక్కడున్న అధికారులు, స్థానికులతో కూడా చర్చించారు.

https://www.facebook.com/ysjagan/videos/4301148493244437/

విశాఖలోని కేజీహెచ్‌లో బాధితులను పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి

సంబంధిత వార్తలు

చదవండి: విశాఖలో ఎల్జీ పాలిమర్స్ నుంచి కెమికల్ గ్యాస్ లీక్.. ముగ్గురి మృతి.. వందలాదిమందికి అస్వస్థత
చదవండి: విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 8కి పెరిగిన మృతుల సంఖ్య.. మరికాసేపట్లో విశాఖకు జగన్
చదవండి: విశాఖ గ్యాస్ లీక్ ఘటన: సీఎం జగన్ తీవ్ర ఆవేదన, సహాయక చర్యల వేగవంతానికి ఉన్నతాధికారులకు ఆదేశాలు…
చదవండి: విశాఖ గ్యాస్ లీకేజి: చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. విశాఖ వెళ్లేందుకు అనుమతి కోసం కేంద్రానికి విజ్ఞప్తి…
చదవండి: విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటన: స్పందించిన ప్రధాని మోడీ, సీఎం జగన్‌కు ఫోన్…
చదవండి: విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటన: జనసేనాని దిగ్భ్రాంతి, హృదయ విదారకం అంటూ…
చదవండి: విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటన: తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే…

 

- Advertisement -