26.3 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు సినీనటి తారా చౌదరి సంచలనం.. తన భర్తపై పామూరు ఎస్సై దాడి చేశాడంటూ…

సినీనటి తారా చౌదరి సంచలనం.. తన భర్తపై పామూరు ఎస్సై దాడి చేశాడంటూ…

- Advertisement -

ప్రకాశం: ఐదు నెలల తన బిడ్డకు మందులు తీసుకొచ్చేందుకు వెళ్లిన తన భర్తను ప్రకాశం జిల్లా పామూరు ఎస్సై చంద్రశేఖర్ అకారణంగా కొట్టాడని సినీ నటి తారా చౌదరి ఆరోపించింది.

లాక్‌డౌన్ కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను, తన సమస్యలను ఎస్సై దృష్టికి తీసుకెళ్లడంతో తనపై కక్ష పెంచుకున్నాడని ఆమె ఆరోపించింది.

చదవండి: కరోనా వేళ కలకలం.. ప్రియుడితో కలిసి భర్తను లారీతో గుద్దించి చంపిన భార్య!

మందుల కోసం బయటకు వచ్చిన తన భర్త రాజ్‌కుమార్‌ను ఇదే అదనుగా అదుపులోకి తీసుకుని కొట్టారని, అక్కడితో ఆగకుండా నాటుసారా తాగించి, దానిని అక్రమంగా రవాణా చేస్తున్నాడని కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది.

విషయం తెలిసి అడిగేందుకు వెళ్తే తనపైనా ఎస్సై దుర్భాషలాడాడని, లాకప్‌లో వేస్తానని బెదిరించాడని తెలిపింది. ఎస్సై కావాలనే కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎస్సై చంద్రశేఖర్‌పై పై అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు తారా చౌదరి తెలిపింది.

- Advertisement -