26.1 C
Hyderabad
Monday, September 21, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉన్నారు.. భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేలు ఇవ్వాలి: జగన్‌కు లోకేష్ లేఖ

కష్టాల్లో ఉన్నారు.. భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేలు ఇవ్వాలి: జగన్‌కు లోకేష్ లేఖ

nara lokesh letter to ap cm ys jagan
- Advertisement -

అమరావతి: లాక్‌డౌన్ కారణంగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కరవైందని, వారికి రూ.10 వేలు చొప్పున ఆర్థికసాయం చేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. 

ఈ ఏడాది ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో 50 లక్షల మంది కార్మికులు పూట గడవక దుర్భర జీవనం గడుపుతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 

చదవండి: మళ్లీ అదే ‘రంగు’రాజకీయం: హైకోర్టు మొట్టికాయలు వేసినా.. తీరు మార్చుకోని జగన్ ప్రభుత్వం

నూతన ఇసుక విధానం కూడా వారి ఉపాధి అవకాశాలకు గండి కొట్టిందని, కుటుంబాలను పోషించ లేక పలువురు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని, ఇప్పుడు లాక్‌డౌన్ వారిని మరింత దెబ్బతీసిందంటూ లోకేష్ తన లేఖ ద్వారా వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 

ప్రభుత్వమే భరోసా కల్పించాలి…

భనవ నిర్మాణ కార్మికుల భవిష్యత్తుకు ప్రభుత్వమే భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులకు అందుబాటులో ఉన్న రూ.1900 కోట్ల బిల్డింగ్ సెస్‌ను వారి సంక్షేమానికే ఖర్చు చేయాలని సూచించారు. 

చదవండి: లాక్‌డౌన్ కష్టాలు: తండ్రి చివరి చూపు కోసం.. ముంబై నుంచి జమ్మూకు సైకిల్‌పై బయల్దేరిన కొడుకు!

చంద్రన్న బీమాను పునరుద్ధరించడంతోపాటు, వారి జీవితాలు బాగుపడేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ ఆ లేఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కోరారు. 

- Advertisement -