26.2 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ విజయవాడలో డేంజర్ బెల్స్.. ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా

విజయవాడలో డేంజర్ బెల్స్.. ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా

india-reports-14821-cases-in-last-24-hrs
- Advertisement -

విజయవాడ: విజయవాడలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.

వీరంతా ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్ మసీదులో జరిగిన మత కార్యక్రమానికి హాజరై వచ్చిన వారేనని అధికారులు తెలిపారు.  

ఇక,  కృష్ణా జిల్లాలో మొత్తం 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. చిట్టినగర్‌లో ఢిల్లీ నుంచి 13 మందిని క్వారంటైన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

మచిలీపట్నంలో 20 మందిని క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, విదేశాల నుంచి వచ్చిన 130 మందిని క్వారంటైన్‌కు పంపించారు.

- Advertisement -